ఐబొమ్మ రవి (ఇమంది రవి) బెయిల్ పిటిషన్‌ విచారణను వాయిదా..

ఐబొమ్మ రవి (ఇమంది రవి) బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఐబొమ్మ రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. శుక్రవారం వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ స్టేషన్‌ (సీసీఎస్‌)లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఐబొమ్మ రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పలుమార్లు పిటిషన్ వేసిన ఐబొమ్మ రవికి షాక్ తగిలింది. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో అతడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపి శుక్రవారం రోజుకు వాయిదా వేసింది.