పేస్, స్పిన్ తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా సాగిన అతడి ఇన్నింగ్స్‌తో టీ20 సిరీ్‌సలో భారత్ ఘనంగా బోణీ చేసింది. అంతకుముందు బౌలర్లు కూడా రాణించడంతో జద్రాన్ బృందం ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఒమర్జాయ్, నబీ కాస్త పోరాడారు.
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో భారత్ శుభారంభం చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా అఫ్ఘాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్), మహ్మద్ నబీ (27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) మాత్రమే రాణించారు. అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42) ఆకట్టుకున్నాడు. నబీ రెండు వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అభిషేక్ నిలిచాడు.
బాదుడే లక్ష్యంగా..: ఓ మాదిరి ఛేదనను భారత్ వాయువేగంతో ఆరంభించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (10) మూడో ఓవర్లోనే వెనుదిరిగినా.. అభిషేక్ చెలరేగాడు. ఇషాన్ క్రీజులో ఉన్నప్పటికీ తానే ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకుని ఎదురుదాడికి దిగాడు. బౌండరీల జోరుతో పరుగుల వరద పారించాడు. అతడి ధాటికి పవర్‌ప్లేలో జట్టు 82/1తో నిలిచింది. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ స్పిన్నర్లు రషీద్, నూర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే అభిషేక్ సెంచరీ ఖాయమనిపించిన వేళ 11వ ఓవర్లో నబీ చేతిలో అవుటయ్యాడు. రెండో వికెట్‌కు ఇషాన్‌తో అభిషేక్ 121 పరుగులు జోడించడం విశేషం. ఇక విజయానికి 5 పరుగుల దూరంలో ఇషాన్ అవుట్ కాగా.. కెప్టెన్ శ్రేయాస్ (8 నాటౌట్), తిలక్ (3 నాటౌట్) మరో 38 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు..

వందేమాతరం పాడి..
భారత క్రీడా చరిత్రలో తొలిసారిగా జాతీయ గీతం ‘వందేమాతరం’ను జాతీయ గేయం ‘జనగణమన’ కంటే ముందు ఆలపించడం గమనార్హం. భారత్, అఫ్గాన్ తొలి టీ20 ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆరంభానికి ముందు భారత క్రికెట్ జట్టు ‘వందేమాతరం’ను ఆలపించింది. ఈ గీతంలోని ఆరు చరణాల (52 సెకన్లు) తర్వాత ‘జనగణమన’ (3 నిమిషాల 10 సెకన్లు.. రెండూ కలిపి 4 నిమిషాల రెండు సెకన్లు)ను పాడించారు. ఇకనుంచి స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తొలి మ్యాచ్‌కు ముందు ఇలాగే పాడిస్తామని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.
సంక్షిప్త స్కోర్లు.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లకు 156/8 (అజ్మతుల్లా 64*, నబీ 33,న అర్ష్‌దీప్ 3/19, వరుణ్ 1/16); భారత్: 13.4 ఓవర్లకు 157/3 (అభిషేక్ 82, ఇషాన్ 42, నబీ 2/28, అజ్మతుల్లా 1/14)
భారత్: శాంసన్ (సి) రసూలి (బి) అజ్మతుల్లా 10, అభిషేక్ (సి) రషీద్ (బి) నబీ 82, ఇషాన్ (సి) రషీద్ (బి) నబీ 42, శ్రేయాస్ (నాటౌట్) 8, తిలక్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: 13.4 ఓవర్లలో 157/3. వికెట్ల పతనం: 1-18, 2-139, 3-152. బౌలింగ్: ఫరూఖి 2-0-38-0, ముజీబుర్ 2-0-16-0, ఒమర్జాయ్ 1-0-14-1, నబీ 3-0-28-2, రషీద్ 3.4-0-34-0, నూర్ 2-0-25-0.