హ్యామిల్టన్‌లోని సెడన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ కు పరాజయమే దక్కింది. ఈసారి డిఫరెంట్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ ఓటమి వెన్నాడింది..ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్బ్ ఫిఫ్టీ (32 బంతుల్లో 61, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం చేజింగ్ ను కివీస్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసి, ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ స్టన్నింగ్ ఫిఫ్టీ (50 బంతుల్లో 93, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కు తలో వికెట్ దక్కింది. . ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 3-2కు తగ్గింది. ఈనెల 4 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది…
రాణించిన శ్రేయస్, ఇషాన్..
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఇషాన్ కిషన్ (62), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) ప్రతిఘటించి మూడో వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే 93 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మైకేల్ బ్రాస్‌వెల్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకుని ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అయ్యర్ కూడా అర్ధ శతకం అందుకున్నాడు. అయితే కీలక సమయంలో ఈ ఇద్దరూ వెనువెంటనే ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ జోరు తగ్గింది. ఆఖర్లో నమన్ ధీర్ 23 బంతుల్లో 33 పరుగులు చేయగా, నితీష్ కుమార్ రెడ్డి 22 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది..
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో పరాజయం పాలైన అనంతరం భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిందని…ముఖ్యంగా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో లభించిన పరుగులను చూస్తే భారత జట్టు మరింత మెరుగైన స్కోరు సాధించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపిందని, బ్యాటింగ్ చేయడానికి ఈ పిచ్ ఏమాత్రం ఈజీగా లేదని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. హార్డ్ లెంగ్త్‌లో పడిన బంతులను ఎదుర్కోవడం కష్టంగా మారిందని.. అయినప్పటికీ 191 పరుగుల స్కోరు సాధించడం సంతృప్తికరమేనని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు..అయితే బ్యాటింగ్ కంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమ జట్టు వైఫల్యం చెందిందని శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు. ఫీల్డింగ్‌లో చోటుచేసుకున్న పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని, ఇది జట్టుకు ఓ గొప్ప పాఠమని అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో సాధించిన విజయాలు జట్టులో మంచి ఫామ్ ను ఇచ్చాయని స్పష్టం చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లలో తాము కొత్త విషయాలను ప్రయోగించి.. సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితిలో ఉండటం వల్లే ఈ రకమైన వ్యూహాలతో బరిలోకి దిగామని, అయినప్పటికీ ఆటగాళ్లందరూ పూర్తి ఉత్సాహంతో ఉన్నారని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు…విదేశీ పర్యటనలకు వచ్చినప్పడు వేర్వేరు పరిస్థితుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, ప్రధానంగా ఫీల్డింగ్ విభాగంలో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. ఇండియాలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇక్కడ ఉన్న చీకటి వెలుగులు, స్పష్టమైన ఆకాశం మధ్య క్యాచ్‌లను అంచనా వేయడం అనుకున్నంత సులభం కాదని ఆయన పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ.. ఈ లోపాలను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మరింత బలంగా పుంజుకుంటామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు…
ఐదవ మ్యాచ్‌లో, తిలక్ వర్మ మరోసారి రన్ రేట్‌ను పెంచడంలో విఫలమయ్యాడు. నో-బాల్‌కు అవుటైన తర్వాత బతికిన ఓవర్లోనే అతను ఔటయ్యాడు…13.2వ ఓవర్లో, తిలక్ వర్మ బంతిని లెగ్ సైడ్ వైపు ఆడటానికి ప్రయత్నించి, బ్యాట్ ఫేస్‌ను చాలా త్వరగా మూసి పొరపాటు చేశాడు; బంతి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచి ఫిన్ అలెన్ కుడి వైపునకు వెళ్లింది. నాథన్ స్మిత్ వేసిన ఆ బంతిని అలెన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు, కానీ అది నో-బాల్ కావడంతో ఆ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను ఆగమని కోరారు.