మహిళల ODI ప్రపంచ కప్ 2025 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ భారత్ VS పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. భారత్ మొదటి నుంచి పేవలమైన బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికి ముగ్గురు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఇప్పుడిప్పుడే టీమిండియా మహిళల జట్టు కోల్కుంటోందన్న సమయంలో గ్రౌండ్లో దోమల బెడద ఒక పెద్ద సమస్యగా మారింది…అధిక దోమలు, ఎగిరే కీటకాలతో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్యాటింగ్ సమయంలో భారత్ బ్యాటర్లు, బౌలింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు దోమలతో ఇబ్బందిపడుతున్నట్లు కనిపించారు. దీంతో వారు ఆన్-ఫీల్డ్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీని తర్వాత పాక్ ప్లేయర్స్ తమ డ్రెస్సింగ్ రూమ్ నుండి స్ప్రే బాటిల్‌ను తీసుకుని గ్రౌండ్లోకి వచ్చారు. అక్కడ మ్యాచ్ మధ్యలో దానిని స్ప్రే చేస్తున్నట్లు కనిపించారు..
భారత్ ఆలౌట్.. పాక్ టార్గెట్..!
మహిళల WCలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో టీమిండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో హర్లిన్ (46) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేయగా ఆమెకు తోడ్పాటు కరువైంది. ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో రిచా (35*) దూకుడుగా ఆడింది. దీంతో భారత్ 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248…..