కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. క్వాలిటీ బౌలింగ్ తో భారత్ ను పాక్ కట్టడి చేసింది. నిర్ణీత ఓవర్లలో కోహ్లి సేన 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిదీ లైనప్ బోలింగ్ వేసి. కీలక వికెట్లు తీశాడు…

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది… దీంతో పాకిస్థాన్‌ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి…అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. అతడి వికెట్‌ను హసన్ అలీ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు, కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించారు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా ఆచితూచి ఆడాడు. జడేజా 13 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం పాండ్యా (11) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరి మూడు ఓవర్లలో భారత్ 37 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు.