పాకిస్తాన్ పై ఘోరంగా ఓడిపోయిన భారత్ క్రికెట్ టీం….చరిత్ర సృష్టించిన పాకిస్తాన్….

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ఓ యుద్ధంలో భావిస్తారు అభిమానులు….. అలాంటి ఇ మ్యాచ్ లో చెత్త గాడిద భారత్ క్రికెట్ ఆటగాళ్లు 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచి ఒక్క వికెట్ కూడా తేలేకపోయింది…
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో టీమిండియా జట్టు సభ్యుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు…..

ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన భార‌త్, పాక్ మ్యాచ్‌లో పాక్ విజ‌యం సాధించింది. టాస్ గెలిచి పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో ముందుగా భార‌త్ బ్యాటింగ్ బ‌రిలోకి దిగింది. అయితే.. భార‌త్‌కు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌.. తొలి బాల్‌కే డక్ ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మ‌రో రెండు వికెట్లు ప‌డ‌టంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. టాప్ ఆర్డ‌ర్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయినా.. త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ భార‌త్‌ను ఆదుకున్నాడు. హాఫ్ సెంచ‌రీ చేసి టీమిండియా స్కోర్ పెంచినా.. కోహ్లీ కూడా హాఫ్ సెంచ‌రీ చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్ట‌డంతో భార‌త్ స్కోర్ నెమ్మ‌దించింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి భార‌త్ 151 ప‌రుగులు చేసి పాకిస్థాన్‌కు 152 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది…

పాకిస్తాన్ లక్ష్యాన్ని…

17.5 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులు చేసి అల‌వోక‌గా భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని పాక్ ఛేదించింది. పాక్ ఆట‌గాళ్లు రిజ్వాన్ 55 బంతుల్లో 78 ప‌రుగులు చేయ‌గా.. బాబ‌ర్ అజామ్ 52 బంతుల్లో 68 ప‌రుగులు చేశాడు…

వరల్డ్ కప్‌లో ఇండియాకు షాక్.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్ పై విజయం సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ..