రజతోత్సవ సభకు వరంగల్‌ వేదిక కావడం గర్వ కారణం… కేటీఆర్..

తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు సభా ప్రాంగణం వద్ద రెండు నిమిషాల పాటు నివాళులర్పించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి.. బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో పురుడు పోసుకుంటున్న సంస్థ టీఆర్‌ఎస్‌ అని తెలిపారు.హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చి పార్టీ బీఆర్‌ఎస్‌ అని అన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని తెలిపారు. దేశం మొత్తంలో గుర్తింపు తెచ్చుకున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టమొచ్చినా తెలంగాణ భవన్‌కు వస్తున్నారని అన్నారు. జనతా గ్యారేజీ మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ గులాబీ జెండాకు జై కొడుతున్నారని చెప్పారు.

రజతోత్సవ సభకు వరంగల్‌ వేదిక కావడం గర్వకారణమని కేటీఆర్‌ అన్నారు. ఎల్కతుర్తి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయ్యి ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. 30-40 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 10 లక్షల వాటర్‌ బాటిల్స్‌, మజ్జిగ ప్యాకెట్లు, వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు..