అర్థరాత్రి.. దేశ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు..!

*🔹అర్థరాత్రి.. దేశ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు..*

_• కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్…_

_• జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో మిస్సైల్స్ ప్రయోగించిన పాకిస్తాన్ సైన్యం.._

_• నిర్వీర్యం చేసిన భారత సైన్యం.._

_• ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్లిన ఇండిగో విమానం తిరిగి ఢిల్లీకి పయనం…

సోమవారం పీఎం మోడీ మాట్లాడుతూ..
గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని, సంయమనాన్ని చూస్తున్నాం. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది. భారత రక్షణ దళాలు చూసిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం.. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరి అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు. ఈ ఉగ్ర దాడితో దేశమంతా నివ్వెర పోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించింది””

పౌరులు, పార్టీలు అన్నీ ఏకతాటి పైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్..

ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బహావల్పుర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పింది. పాక్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశాం. పాకిస్థాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది. భారత్ చర్యలకు బెంబేలేత్తి పోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు

.”ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి. భారత్ నిర్ణయాలకు అనుగుణం గానే చర్చలు సాగుతాయి.

పాకిస్థాన్ అణు బ్లాక్మెయిలింగ్ ఇక సహించేది లేదు. అణు శక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుద ముట్టించి తీరుతుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు..