చిన్న వయసు నుండే యోగ పై అవగాహన కలిగి ఉండాలి..యోగాచార్యులు,ఆయుర్వేద వైద్యుడు షేక్ బహరలి…

వేసవికాలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాండురంగాపురం ఖమ్మం లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయనీయుల మరియు
పిఈటి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత యోగ,ప్రాణాయామ, ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ శిక్షణలో విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, చక్కని నిద్ర కోసం మానసిక ఒత్తిడిని విముక్తి, జ్ఞాపకశక్తి కొరకు, చదివినది గుర్తు ఉండడానికి, మతిమరుపు కోసం,తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి,శరీరంలో రక్తప్రసరణకు,శరీరంలో అన్ని భాగాలు చైతన్యవంతం కోసం, గుండె,ఊపిరితిత్తులు, కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి,జబ్బులు రాకుండా ఉండటానికి,మంచి నడవడిక కోసం, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదగడానికి
శ్రీ యోగాచార్యులు,ఆయుర్వేద వైద్యుడు షేక్ బహరలి ఉదయము/
సాయంత్రము ఉచిత యోగ శిక్షణ శిబిరము నిర్వహిస్తున్నారు అని తెలపడం జరిగింది…