కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాయ్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు (Virat Kohli century)..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేశాడు. రాంచి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో శతకం చేసిన కోహ్లీ.. రాయ్పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లోనూ మూడు అంకెల స్కోరు అందుకున్నాడు…
కోహ్లీ, గైక్వాడ్ మూడో వికెట్కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు (Gaikwad Kohli partnership). ప్రస్తుతం టీమిండియా 38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. కోహ్లీతో పాటు కెప్టెన్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రోజు మ్యాచ్లో కూడా గెలిస్తే ఈ సిరీస్ను టీమిండియా దక్కించుకుంటుంది…