ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుర్తు తెలియని దుండగులు విమానాన్ని హైజాక్ చేస్తామని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు..
బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సంస్థలు చర్యలు చేపట్టాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు.
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్, భద్రతా బలగాలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయంలో కొంతసేపు హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణికులు ఎవ్వరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు..