శంషాబాద్: ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ రాము, రమావత్ మోతిలాల్, రమావత్ గాంధీ, సుధీర్ కలిసి నకిలీ నోట్ల తయారీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు..ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్న నిందితులు.. రూ.500, రూ.200, రూ.100 నోట్లను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, పాన్ డబ్బాల వద్ద నకిలీ నోట్లను చలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.