వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ…!

వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ….

దేవరకొండ…….
దేవరకొండ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ K C గుప్తా జన్మదిన వారోత్సవాల భాగంగా2 వ రోజు దేవరకొండ వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లకు బ్రెడ్ పండ్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ అధ్యక్షురాలు పందిరి జ్యోతి, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ ఆలంపల్లి పద్మ, వాసవి వనిత క్లబ్ కోశాధికారి ఆలంపల్లి శిరీష, వాసవి క్లబ్ కార్యదర్శి బెల్లిదే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.