కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్

*కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్*

ఫిబ్రవరి 28నుండి నిర్వ హించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది.

వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూ డదని ఆదేశించింది. గతం లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమై న మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.