జలుబు అనుకుంటే పొరపాటే..
కరోనా కొత్త వేరియంట్‌పై అలర్ట్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేరియంట్స్ మళ్లీ కలకలం రేపుతున్నాయి. ఇటీవల గుర్తించిన కొత్త సార్స్-కోవ్-2 (SARS-CoV-2) లీనియేజ్ PJ.2.1 పలు ఖండాల్లో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా అంతర్జాతీయ ప్రజారోగ్య నిఘా విభాగాలు దీనిపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారిగా 2026 మే 2న కెనడాలోని అంటారియోలో గుర్తించారు. అతి తక్కువ కాలంలోనే ఇది అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వ్యాపించింది. అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకే పరిమితం కాకుండా సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకూ చేరుకుంది. ముఖ్యంగా స్పెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే అక్కడక్కడా ఒకటి రెండు కేసులు కనిపించడం మాత్రమే కాకుండా, స్థానికంగా కూడా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న సూచనలు ఉన్నాయి.
అంటారియో పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన గణాంకాలు మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాయి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 17 మధ్య జన్యు పరీక్షలు నిర్వహించిన కరోనా నమూనాల్లో PJ.2.1 వాటా ఏకంగా 25.2 శాతానికి చేరింది. అంతకుముందు నాలుగు వారాలతో పోలిస్తే దీని వాటా 16.9 శాతం పెరిగింది. ఒకప్పుడు గుర్తించిన కొత్త వేరియంట్ ఇప్పుడు అక్కడ గణనీయమైన ప్రాబల్యాన్ని సాధిస్తోందన్నమాట.
వైరస్‌లో వచ్చిన మార్పులే అసలైన మేటర్!
ఇప్పుడు PJ.2.1లో ఈ స్పైక్ ప్రోటీన్ నిర్మాణంలో అనేక మ్యుటేషన్లు కనిపించాయి. ఈ మార్పులు వైరస్ ACE2 రిసెప్టర్‌తో అనుసంధానమయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ ప్రభావితం చేస్తే వైరస్ మనిషి కణాల్లోకి మరింత సులభంగా ప్రవేశించగలదా? అనే అంశాలపై పరిశోధకులు దృష్టి పెట్టారు.
Journal of Infection లో ప్రచురితమైన ప్రాథమిక పరిశోధన ప్రకారం.. PJ.2.1కు ACE2తో అనుసంధానమయ్యే సామర్థ్యం పెరిగి ఉండవచ్చని సూచనలు కనిపించాయి. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది..
దాదాపు కరోనా ఏదైనా మనం భయపడాల్సిన అవసరం లేదు.. అనిటికి చికిత్స అందుబాటులోకి వచ్చింది… ధైర్యంగా ఉంటే హాస్పటల్ కూడా అవసరం లేదు… డాక్టర్ సలహాలు సూచనలు పాటిస్తే సరిపోతుంది…..