జమ్ము కశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడి…

జమ్ము కశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పౌరుడు చనిపోగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని హరి సింగ్ హై ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా సాయంత్రం 4.20 ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు…ఈ దాడిలో గాయపడిన వారిలో ఒక పోలీసు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చనిపోయినట్లు వివరించారు.మృతుడు నగరంలోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్లాం మఖ్దూమీగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఖండించారు…ఆదివారం సాయంత్రం నాలుగన్నర గంటల ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్ లో ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్య ప్రజలు మార్కెట్ కు వచ్చారు. ఈ దాడిలో 71 ఏళ్ల వృద్ధుడు స్పాట్‌లోనే మరణించాడు. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులూ ఉన్నారు” అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.