ఛత్తీస్‌గఢ్‌లో ఓ పరిశోధక (investigation journalist) జర్నలిస్ట్ దారుణ హత్యకు/ గురయ్యారు. ఓ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ, ఎన్డీటీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ఇటీవల బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలీ రోడ్డు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టారు. ఈ ప్రాజెక్టు టెండరు విలువ ప్రారంభంలో రూ.50 కోట్లు కాగా, ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా వ్యయాన్ని రూ.120 కోట్లకు పెంచినట్లు ప్రజల దృష్టికి తీసుకెళ్లారు…ఈ వార్తా కథనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ నిర్మాణం, వ్యయంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్ సోదరుడు రితేశ్ చంద్రకర్ ఈ నెల 1 రాత్రి ముకేశ్, సురేశ్‌ల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముకేశ్ ఫోన్ స్విచాఫ్ కావడంతో ఆయన సోదరుడు యుకేశ్ అనేక చోట్ల వెతికి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముకేశ్ మృతదేహం బాగా ఉబ్బిపోయిన స్థితిలో చట్టన్పరలోని సురేశ్‌కు చెందిన ఇంటి ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో కనిపించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ సురేశ్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.