ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్-లఖ్‌నవూ సూపర్ జెయిం ట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. కేవలం 155 పరుగులను కాపాడుకోవడంలో కోల్‌కతా బౌలర్ల పట్టు వదలని ప్రదర్శన తాజా సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. అటు ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా సాగి.. ఆఖరి బంతికి సిక్సర్‌తో మ్యా చ్‌ను లఖ్‌నవూ సూపర్ ఓవర్‌కు మళ్లించింది. కానీ నరైన్ ధాటికి తొలి మూడు బంతులకు ఒక్క పరుగే చేసి రెండు వికెట్లు కోల్పోవడం.. అటు మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన కోల్‌కతా సూపర్ సంబరాల్లో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎల్ఎ్సజీకిది వరుసగా ఐదో ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. రింకూ సింగ్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 నాటౌట్), గ్రీన్ (21 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. మొహిసిన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేయడంతో టై అయ్యింది. పంత్ (42), మార్క్రమ్ (31), బదోని (24) ఫర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రింకూ నిలిచాడు.
సమీ మెరుపులు..
లక్నో విజయానికి చివరి 24 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో ఆయుష్ బదోని, హిమ్మత్ సింగ్ ఉన్నారు. కార్తీక్ త్యాగి వేసిన 17వ ఓవర్లో రెండు సిక్సర్లు రావడంతో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బదోనీని అవుట్ చేసినా, జార్జ్ లిండే రెండు ఫోర్లతో 10 పరుగులు రాబట్టాడు. ఇక చివరి 12 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్లో షమీ, హిమ్మత్ సింగ్ చెరో ఫోర్ కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి…
సూపర్ ఓవర్లో కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతం చేశాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన నరైన్, కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో లక్నో కేవలం 2 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రింకూ సింగ్, ప్రిన్స్ యాదవ్ వేసిన మొదటి బంతికే ఫోర్ కొట్టి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ ఏడాది IPLలో KKRకు ఇది రెండో విజయం. 5 పాయింట్లతో ఆ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు, LSG పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కు ఇది నాలుగో విజయం. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరగా, సీఎస్కే ఆరో స్థానానికి పడిపోయింది.
ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 380 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ, ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండగా , అతని తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో సూర్యవంశీ, రాహుల్ ఇద్దరూ చెరో 357 పరుగులు చేశారు..
సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు సునీల్ నరైన్ చుక్కలు చూపించాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో కేవలం 3 బంతుల్లోనే 2 వికెట్లు తీసి లక్నోను కేవలం 1 పరుగుకే కట్టడి చేశాడు. రిషబ్ పంత్ 1 పరుగు వద్ద నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తరపున రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే. మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాటర్ల వైఫల్యం, సూపర్ ఓవర్లో నరైన్ ధాటికి లక్నో తలవంచక తప్పలేదు.