ఇరాన్ పై పాకిస్తాన్ యుద్ధంనికి సిద్ధం..!

పాకిస్తాన్ ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమైంది. సరిహద్దులోకి ఆయుధాలు తరలిస్తోంది. భారీ ఎత్తున మిలిటరీ ఇరాన్ సరిహద్దులకు కదిలిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ థార్ కూడా ధృవీకరించారు. సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం ప్రకారం, సౌదీపై దాడి చేసిన వారితో పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సౌదీపై ఇరాన్ క్షిపణి దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. అయితే అమెరికా ఆదేశాల ప్రకారమే పాకిస్తాన్ ఇరాన్ తో యుద్ధానికి కదిలిందన్నది బహిరంగ రహస్యమే. సౌదీతో యుద్ద ఒప్పందం అన్న ముసుగులో పాకిస్తాన్ ఇరాన్ పై దాడికి సిద్ధమైంది.. మరో వైపు నుంచి కుర్ధులు కూడా ఇరాన్ తో పోరు చేస్తున్నారు..