భారత్ మా మిత్రదేశం, హార్మోజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు, రుసుము ఉండదు..ఇరాన్..!

భారత దేశానికి ఆయిల్,
గ్యాస్ తీసుకెళ్లే నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హర్మోజ్ జలసంధి వద్ద నౌకలు టోల్ కట్టాలన్న ఇరాన్ నిబంధనపై అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళానికి సంబంధించి యుద్ద నౌకలు హార్మోజ్ జలసంధి దిగ్బంధనానికి వస్తున్నాయి. హార్మోజ్ వద్ద ఇక ఆటలు కట్టిస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అయితే అమెరికా నౌకలు వస్తే అంతు చూస్తామని ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకి తీవ్ర అంతరాయం కలిగి, ప్రపంచ వాణిజ్య రంగం సంక్షోభంలో పడనుందన్న భయాలు ఉన్నాయి..ఈ నేపథ్యంలో ఇరాన్,. భారత్ కు హార్మోజ్ జలసంధి మీదుగా పోయేందుకు ఎలాంటి ఆంక్షలు, రుసుము లేదని చెప్పేసింది…