యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది..రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు..బీచ్‌లో దిగిన బికిని ఫొటోలపై నెటిజన్లు నెగిటివ్‌గానే స్పందించారు. ఇద్దరి పిల్లలు ఉన్న నువ్వు , వారి ముందే ఇలాంటి దుస్తులు ధరిస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. వారికి ధీటుగానే అనసూయ సమాధానం ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తావు అని అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పింది అనసూయ. నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్‌తో డేటింగ్ చేసేదాన్ని అని సమాధానంగా ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.