హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న పలు దేశ జెండా ఉన్న నౌకలపై ఇరాన్ దాడి

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, వాటికి ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడుల్లో చాలా దేశాలు నలిగిపోతున్నాయి…ఇందులో గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఉపఖండ దేశాలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ చమురు సరఫరాలో 20-25 శాతం రవాణా సాగే హార్ముజ్ జలసంధిని (strait of hormuz) ఇరాన్ మూసేసింది. దీంతో ఇందులో ప్రయాణించే భారతీయ నౌకలకు ముప్పు పొంచి ఉందన్న సంకేతాల మధ్య ఇవాళ ఓ దుర్ఘటన చోటు చేసుకుంది.

హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న పలావు దేశ జెండా ఉన్న నౌకను ఇవాళ ఇరాన్ దాడి చేసి ముంచేసింది. సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇవాళ ఈ నౌక హార్ముజ్ జలసంధికి సమీపంలోకి రాగానే ఒమన్ సరిహద్దు సమీపంలోని ముసాండమ్ ద్వీపకల్పం వద్ద ఉన్న ఖసాబ్ పోర్టు దగ్గర ఈ నౌకను ముంచేసింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 15 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు ఒమన్ తెలిపింది..ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో అటువైపుగా వెళ్లే నౌకలు ఆలస్యం కావడంతో పాటు చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్ హార్ముజ్ జలసంధి మీదుగా 50 శాతం ఎల్ ఎన్ జీని రవాణా చేసుకుంటోంది. ఇప్పుడు తాజా పరిణామాల ప్రభావం భారత్ పై మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ యుద్దం మరిన్ని రోజులుగా సాగితే చమురు ధరల మంట తప్పదన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. అయితే భారత్ ఈ పరిణామాలపై ఇప్పటివరకూ స్పందించకుండా మౌనం వహిస్తుండటం విశేషం. కేవలం ఇరాన్ దాడులు చేసిన గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ ట్వీట్లు పెడుతున్నారు….