ఇరాన్ దాడులపై యూఏఈ స్పందించింది. ”పొరుగు దేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు”. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెచ్చరికాలు.
అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా ఖమేనీ హతమయ్యారు. ఇరాన్పై ఇజ్రాయిల్ ”ఆపరేషన్ రోరింగ్ లయన్” కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇరాన్ టాప్ సైనిక నాయకత్వాన్ని నాశనం చేసినట్లు ప్రకటించింది…ఇదిలా ఉంటే, ఇరాన్ తన ప్రతీకార దాడుల్ని అమెరికా మిత్రదేశాలపై కొనసాగిస్తోంది. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై దాడులు చేసింది. ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి పై దాడులు చేసింది. ఎయిర్పోర్టులు, లగ్జరీ హోటళ్లపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్ అటాక్స్ చేసింది…ఇదిలా ఉంటే, ఇరాన్ దాడులపై యూఏఈ స్పందించింది. ”పొరుగు దేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు” అని యూఏఈ (UAE) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెచ్చరించారు. యూఏఈ వంటి పొరుగు దేశాలు యుద్ధంలో లేనందున ఇరాన్ తెలివిగా వ్యవహరించాలని అని యూఏఈ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన బాధ్యతారహిత్యమైన చర్యలతో ఒంటరైపోతోందని పేర్కొన్నారు. ” గల్ఫ్ దేశాలపై ఇరాన్ దురాక్రమన ఒక తప్పుడు లెక్క” అని యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ అన్నారు.
శనివారం అబుదాబీలోని అల్-దఫ్రా అమెరికన్ బేస్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇదే కాకుండా దుబాయ్లోని ఐదు ప్రాంతాలపై ఇరాన్ అటాక్ చేసింది. యూఏఈ మాత్రమే కాకుండా ఖతార్ రాజధాని దోహాపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. బహ్రైయిన్ మనామాను కూడా ఇరాన్ వదల్లేదు.