వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కు ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన మలేషియాలో ఒక ఆస్పత్రిలో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి…అలాగే అతని భార్య ఫర్హత్ నాయక్, కుమార్తె జిక్రా నాయక్లకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ నిర్థారణ అయ్యిందంటూ ఇంటర్నెట్ లో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు…
మనీలాండరింగ్ మరియు ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించారనే ఆరోపణల మధ్య 2016లో భారతదేశం నుండి పారిపోయిన జకీర్ నాయక్ అప్పటి నుండి మలేషియాలో నివసిస్తున్నాడు..
https://x.com/RealBababanaras/status/1965322015768019200?t=Lvy9uwmy-S5WXhoq88bXsA&s=19
2016లో భారతదేశం నుండి పారిపోయిన నాయక్ తన న్యాయవాది ద్వారా తనకు ఎయిడ్స్ సోకిందన్న వార్తలను ఖండించారు. మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నాడు. కాగా జకీర్ నాయక్ ఎయిడ్స్ బారినపడ్డాడనే వార్తను ఇప్పటివరకు, విశ్వసనీయ మీడియా సంస్థలు ఏవీ ధృవీకరించలేదు..