ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం…!

తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. రేపు(గురువారం) కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్లో వర్షం : ఇవాళ హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది…

హైదరాబాద్లో వర్షం : ఇవాళ హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చేవెళ్ల పట్టణ కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారింది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను వరద ముంచెత్తింది. దీంతో విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అలాగే యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సైదాబాద్, సరూర్నగర్, సంతోష్నగర్, పాతబస్తీ, బహదూర్ పుర, కిషన్ బాగ్, పురానపుల్, జూ పార్క్, మెహదీపట్నం, రేతి బౌలి, ఖైరతాబాద్, పంజాగుట్ట, మలక్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, నాగారం ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..