కల్వకుంట కవిత నాయకత్వంలో ఈ నెల 25న కొత్త పార్టీ…జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్..

అమరుల ఆకాంక్షలు నెరవేర్పుట కొరకు కల్వకుంట కవిత నాయకత్వంలో ఈ నెల 25న కొత్త పార్టీ..!

తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్..

హుజూర్నగర్ టౌన్…..
తెలంగాణ ప్రజలు ఊహించిన ప్రత్యేక రాష్ట్రం రాలేదని సంపూర్ణ సర్వోదయ తెలంగాణ ఏర్పాటు కోసం కవితక్క ప్రజల్లో కెళ్ళి పోరాడుతున్నదని తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు.

శుక్రవారం హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని టౌన్ హాల్ నందు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసమర్ధ ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు సమయంలో కొత్త పార్టీలు ఆవిర్భవించడం సహజమేనని, అమరుల ఆకాంక్షల నెరవేర్పు కొరకు కవితక్క నేతృత్వంలో నూతన పార్టీ ఆవిర్భవించబోతుందన్నారు.

రాష్ట్రం లో ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు ప్రజల కు ఏంమేలు చేశాయని వ్యాఖ్యానించారు.

. పదేళ్ల బిఆర్ఎస్ పాలన రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు రాష్ట్రo ఏర్పడిందన్న పేరే తప్ప ఒరిగిందేమీ లేదని దుయ్యబడ్డారు. జాగృతి కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించిన సందర్భంలో ప్రజలు రాష్ట్రం ఏర్పడిందన్న సంతృప్తిగా లేరని గమనించి ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో తేచ్చేందుకు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.

ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు అధికారంలో ఉండడానికి ఏమాత్రం తగదని ఆయన అన్నారు. ప్రజల బాగోగుల కంటే పార్టీల నాయకులు వారి పదవులు కాపాడుకోవడం ,ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యతరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలను కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గాని పరిష్కార మార్గం చూపలేదు అన్నారు
. అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతనంగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజలను మమేకం చేసుకొని ఉద్యమాల దిశగా కవితక్క అడుగులు వేస్తుందని కవితక్క ఆశయాలకు ప్రజల మద్దతు వారి దీవెనలు ఉంటాయని ఆయన వివరించారు.

*పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ*

ఈ సందర్భంగా ఈనెల 25న నూతన పార్టీ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు మందడి సోమిరెడ్డి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, జిల్లా నాయకులు ధరావత్ లక్ష్మణ్ చంటి నరసింహారావు రాహుల్ నాగుల్ మీరా వేణు నకరికంటి చిరంజీవి ధారావత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…