జగిత్యాల: బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి.!

జగిత్యాల: బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి
బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బక్రీద్ పండగ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, మసీదులు, మార్కెట్ ప్రాంతాలు, టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్స్ ను జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్ ఉన్నారు.