కశ్మీర్‌లో కొనసాగుతోన్న ఉగ్రవేట..

పహ‌ల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసి.. ఆయుధాలు, డిజిటల్‌ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు…

పూంచ్‌లో పాక్ కాల్పుల్లో భారత సైనికుడు వీరమరణం పొందాడు.

చండీగఢ్..

పూంచ్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో ఒక భారతీయ సైనికుడు అమరుడయ్యాడు.

మృతుడిని హర్యానాలోని పాల్వాల్ కు చెందిన దినేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఈ కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు మరియు అతన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.