జాన్ పహాడ్ దర్గా ఇనామ్ భూముల వేలంపై స్టే ఉత్తర్వులు జారీ..!

జాన్ పహాడ్ దర్గా ఇనామ్ భూముల ఏక్-సాల్ విధానం నిలిపి వేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసిన హై-కోర్ట్…
గత నెల 30 వ తారీకున పాలకీడు మండల తహసీల్దార్ దర్గా ఇనాం భూములు 57 ఎకరాల 38 కుంట ల కౌలు ప్రక్రియ కు టెండర్ ప్రకటన ఇచ్చిన సంగతి విధితమే. ఈ ప్రకటన మేరకు 06 వ తారీఖున టెండర్ ప్రక్రియ చెప్పటాలి కానీ దర్గా ముత్తవల్లి మొహమ్మద్ అహ్మద్ హుస్సేన్ అట్టి భూముల పై టెండర్ ప్రక్రియ ను నిలిపివేయాలని హై-కోర్టు ను ఆశ్రయించడం జరిగింది. పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం దర్గా ముత్తవల్లి గా గుర్తించే ప్రక్రియ తీర్పు దశలో ఉన్నందున ఇనాం భూముల పై ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దు అనీ మండల తహసీల్దార్ మరియు వక్ఫ్ బోర్డు CEO కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను గౌరవిస్తూ MRO కూడా టెండర్ ప్రక్రియ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించినట్లుగా సమాచారం…..ఈ తీర్పు పై దర్గా ముత్తవల్లి మొహమ్మద్ అహ్మద్ హుస్సేన్ తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు …

సేకరణ..

షేక్ మహబూబ్ అలీ..
పాలకీడు జర్నలిస్ట్..
.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959