🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🔆పంచాంగం🔆
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 07 – 08 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *త్రయోదశి* మ1.27 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* మ2.08 వరకు,
యోగం : *విష్కంభం* ఉ7.44 వరకు,
కరణం : *తైతుల* మ1.27 వరకు,
తదుపరి *గరజి* రా1.36 వరకు,
వర్జ్యం : *రా10.27 – 12.06,*
దుర్ముహూర్తము : *ఉ9.58 – 10.49,*
మరల *మ3.04 – 3.55,*
అమృతకాలం : *ఉ9.02 – 10.44,*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.44,
సూర్యాస్తమయం: 6.28,
*_నేటి మాట_*
*భగవన్నామ స్మరణ*
చనిపోయే ముందు భగవంతుని తలుచుకుంటే
మోక్షం వస్తుంది అని విని ఒకతను భగవంతునితో నన్ను తీసుకెళ్లే ముందు ఒక సారి నాకు తెలియ చేస్తే ..నేను నిన్ను తలుచుకుంటా అన్నాడు
_దానికి భగవంతుడు కూడా సరే అన్నాడు…_
ఇంకేముంది అతను హ్యాపీగా వున్నాడు …
ఒక రోజు హఠాత్తుగా అతడు చనిపోయాడు …
యముడు వచ్చి నరకానికి తీసుకువెళ్తుంటే, హే భగవాన్. నువ్వు నాకు చెప్తానని మాట ఇచ్చి నన్ను మోసం చేసావు అన్నాడు…
_దానికి భగవంతుడు ఇలా అన్నాడు!!_.
నేను నా పద్ధతిలో నీకు 4 సార్లు తెలియ చేశాను
కానీ నువ్వు పట్టించుకోలేదు అన్నాడు.
అతను నువ్వు అబద్ధం చెప్తున్నావ్ స్వామీ,
నాకు ఏమీ తెలియచేయలేదు అన్నాడు!!…
_అపుడు భగవంతుడు ఇలా అన్నాడు._
మొదటి సారిగా నీ జుట్టు తెల్లబడేలా చేశాను
నువ్వు రంగేసుకొని పట్టించుకోలేదు,
రెండవ సారి గా కళ్ల కి చత్వారం వచ్చేలా చేశాను నువ్వు కళ్ళజోడు తెచ్చుకున్నావు కానీ నన్ను పట్టించుకోలేదు…
మూడవ సారిగా B.P, షుగర్ వచ్చేలా చేశాను
తిండి మార్చుకున్నావు కానీ నన్ను స్మరించుకోలేదు…
నాల్గవ సారిగా నీ పళ్లు ఊడేలా చేశాను
నువ్వు పళ్లు కట్టించుకున్నావు, కానీ …నన్ను (భగవంతుని) ఒక్కసారి కూడా తలుచుకోలేదు…
_ఇలా నీకు నాలుగు సార్లు తెలియచేసినా పట్టించుకోలేదు!!_
ఇక నీ టైం అయిపొయింది
అందుకే నరకానికి తీసుకెళ్తున్నా అన్నాడు…
జీవితంలో ప్రతిదీ హ్యాపీగా accept చేస్తూ , భగవంతుని స్మరిస్తూ ఉండాలి,
సారాంశం ఏమిటంటే, ఒకే సారి స్మరణ రాదు, స్మరించడం అలవాటు చేసుకోవాలి, అపుడు చివరిదశ లో సహజంగా భగవంతుని స్మరణ వస్తుంది!!…
*_🔆శుభమస్తు🔆_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏