కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారం లేదా ఆదివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారం లేదా ఆదివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది..!.

_• పార్టీ నిర్ణయం అనుసరం నేడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు..!_

_• ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు..!_

_రేపు కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు..!_

_అయితే ఒక వైపు ఈరోజు రాజీనామా సమర్పించడానికి సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా… గవర్నర్ ఆకస్మికంగా ముంబై వెళ్లారు.. ఈరోజు ఆయన వస్తారో రారో స్పష్టత లేదని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..!_

_ఒకవేళ గవర్నర్ అందుబాటులో లేని పక్షంలో గవర్నర్ కార్యాలయం కార్యదర్శికి రాజీనామా లేఖ అందచేయనున్నట్లు ప్రచారం సాగుతోంది..!_

_అత్యంత కీలక సమయంలో ముందస్తు అపాయింట్మెంట్ కోరినప్పటికీ గవర్నర్ అందుబాటులో లేకుండపోవడంపై కాంగ్రెస్ ముఖ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..!_

_బీజేపీ పెద్దలు కావాలనే ఇలా చేస్తున్నారని.. వారి ఆదేశాలకు అనుగుణంగానే గవర్నర్ అందుబాటులో ఉండకుండా ముంబై వెళ్లిపోయినట్లుగా వారు భావిస్తున్నారు..!_

_ఈరోజు రాజీనామా ప్రక్రియ పూర్తవుతే కానీ తదుపరి ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది…_

లేదంటే సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది..