తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!

బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమే అని ఆయన అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ అన్నారు. ప్రజా సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని హితవు పలికారు కేసీఆర్..అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ చెప్పారు..