బీఆర్ఎస్ ముఖ్యనేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యనేతలతో ఇష్టాగోష్టి
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ
పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్……
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు..