*సూర్యాపేట జిల్లా…..*

గరిడేపల్లి పరిధిలో రెండు కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు.. …

వారి వద్ద నుండి రెండు ఫోన్లు,,
ఓ బైకు స్వాధీనం……

నిందితుల్ని రిమాండ్ కు తరలించిన పోలీసులు…

హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో Dsp శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..

చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ముష్టికుంట గ్రామానికి చెందిన బొట్ల బాలకృష్ణ (ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో నివాసం), హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్ అనే ముగ్గురు వ్యక్తులు గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో గల డంపింగ్‌యార్డు వద్ద గంజాయి పంచుకుంటున్నారని సమాచారం అందడంతో ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు…
వారు TS15FC9289 నంబరు గల పల్సర్ బైక్‌పై వచ్చి గంజాయి ప్యాకెట్లను పంచుకుంటుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల గంజాయి, ఒక బైక్, బాలకృష్ణ నుండి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి సరఫరాదారుడిగా గణపవరపు శ్రీకాంత్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు…శ్రీకాంత్ ఇచ్చిన మెలుకువల మేరకు, అతను సీలేరు ప్రాంతానికి వెళ్లి కార్తీక్ అనే వ్యక్తి వద్ద నుండి రూ.8000కు 4 కేజీల గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. గత నెల 29న ఈ ముగ్గురికీ రూ.1000 విలువైన గంజాయి అమ్మగా, శుక్రవారం మరోసారి రూ.3000 విలువైన గంజాయి అమ్మినట్లు ఒప్పుకున్నాడు. శ్రీకాంత్ వద్ద నుండి మరో 2 కేజీలు 30 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నలుగురిపైనా నార్కొటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు… ఈ కేసులో సీఐ యొక్క సహా ఎస్సై కూడా చాలా కష్టపడి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే దాంట్లో కఠినంగా వ్యవహరించడంతో వారిని అభినందిస్తున్నట్లు కూడా డిఎస్పి తెలిపారు… మారకద్రవ్యాలకి బానిసలు అయితే వారిని మళ్లీ బాగు చేయడం చాలా కష్టం కావున తల్లిదండ్రులందరూ కూడా ఇది గమనించి పిల్లలని మారకద్రవ్యాలకు దూరంగా ఉంచేలా వ్యవహరించాలని తెలిపారు…ఈ ప్రెస్ మీట్ లో ci చరమంద రాజు, si నరేష్, కానిస్టేబుళ్లు నాగరాజు,శంబయ్య తదితరులు పాల్గొన్నారు..