ఉత్కంఠ పోరులో కోల్​కతాపై ల‌క్నో విజయం..!

ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి.

ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్‌కతా విజయానికి నాలుగు అడుగుల దూరంలో ఆగిపోయింది. నైట్రైడర్స్ ఓపెనర్లు డికాక్‌ 15(9), సునీల్‌ నరైన్‌ 30 (13) శుభారంభం చేసినా ఆ తర్వాత ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రహానె 61 (35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ 45 (29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం లక్నోని వరించింది. కేకేఆర్ పోరాడి ఓడింది. కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. ఆఖరి ఓవర్ లో 24 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది..తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. 239 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులే చేసింది. దీంతో లక్నో జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ లో రహానె (61), వెంకటేశ్ అయ్యర్(45) రాణించారు. చివరలో రింకూ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ సీజన్ లో లక్నోకి ఇది నాలుగో విజయం. మొత్తం 6 మ్యాచులు ఆడింది. రెండింటిలో ఓడింది. పాయింట్ల పట్టిలో 4వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ కు ఈ సీజన్ లో ఇది మూడో ఓటమి. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడగా రెండింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల టేబుల్ లో 6వ స్థానంలో ఉంది..