బడ్జెట్ రూ.10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 500 కోట్లు*

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బరులు ద్వారా కోడి పందేల నిర్వాహకులు వ్యసన పరుల జేబులు కొల్లాగొట్టారు. రాజకీయ పలుకుబడే పెట్టుబడిగా బరిలోకి దిగారు.

ఈ ఏడాది పండగ పేరు చెప్పి పశ్చిమలో నిర్వాహకులు కేవలం రూ.10 కోట్లు పెట్టుబడిగా పెట్టి రూ.100 కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తోంది. రూ. 500 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఆచంటలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బరులు పెట్టి, పేకాట, గుండాట, కోతాట నిర్వహించారు.జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గం సాక్షిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 భారీ బరులు, 100 పెద్ద బరులు, మరో 150 చిన్న బరులలో కోడి పందేలు నిర్వహించారు. జూదాలు నిర్వాహణతో పేద మధ్య తరగతి వర్గాల జేబులకు చిల్లు పడింది. జూదశాలల వద్ద మద్యం వ్యాపారం కూడా జోరుగా సాగింది. నిఘా అధికారులు మామూళ్ల మత్తులో జోగారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ దళారులు ఏడాదికి సరి పడా సంపాదన మూడురోజుల్లో వెనుక వేసుకున్నారని సమాచారం.