టీడీపీలో టెన్షన్ పెంచుతున్న పవన్ నిర్ణయాలు
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొంత కాలంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి. అప్పుడు హోం మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుంచి తిరుపతి తొక్కిసలాట ఘటన వరకు పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పవన్ చెబితే చంద్రబాబు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో మొదలైంది.