SBI ఖాతాదారులకు షాక్.. ATM విత్‌డ్రాయల్ రూల్స్‌లో భారీ మార్పులు..!

SBI ఖాతాదారులకు షాక్.. ATM విత్‌డ్రాయల్ రూల్స్‌లో భారీ మార్పులు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక అలర్ట్. ముఖ్యంగా శాలరీ అకౌంట్ హోల్డర్ల ATM వినియోగ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

ఇకపై ఇతర బ్యాంకుల ATMలలో ఉచితంగా చేసుకునే లావాదేవీల సంఖ్యను తగ్గించనున్నారు. ఇప్పటివరకు నెలకు 10 ఫ్రీ ATM ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉండగా.. కొత్త నిబంధనల ప్రకారం వాటిని 5కి తగ్గించనున్నారు.

ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి అదనపు క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.23 + GST ఛార్జీ విధించనున్నారు. అలాగే నాన్-క్యాష్ ATM ట్రాన్సాక్షన్లపై రూ.11 + GST చార్జ్ చేయనున్నట్లు సమాచారం.

📅 కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అందుకే SBI ఖాతాదారులు ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించే ముందు ఈ ఛార్జీలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.