కృష్ణానదిలో కలుషితనీరు..
భయబ్రాంతులకు గురి చేస్తున్న కలుషితనీరు…
ఎవరో తీసుకువచ్చి పోస్తున్నారా..?
లేకపోతే స్థానికంగా ఇండస్ట్రీ లతో నీరు కలుషితం అవుతున్నాయా…?.
ఈ నీరు తాగుతున్న మూగజీవాల పరిస్థితి ఏమిటి..?
ప్రశ్నార్ధకంగా మారుతున్న కలుషిత నీరు. వ్యవహారం..!
*సూర్యాపేట జిల్లా*….
మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది నీరు ఇటీవల కాలంలో తీవ్రంగా కలుషితమవ్వడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది…
కృష్ణానది లేకపోతే మూసీ నది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది..
గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణా నదిలో కెమికల్ పదార్థాలను కలుపుతున్నారా,, లేక స్థానికంగా ఉన్న ఇండస్ట్రీ వ్యర్థ నీరు రావడం వల్ల ఇలా జరుగుతోందా..! అనే కారణాలపై వెతుకులాటా జరుగుతుంది…
కృష్ణానది నీరు మాత్రమే ఇలా అయ్యిందా లేకపోతే భూగర్భ జలాలు కూడా ఇలాగే ఉన్నాయా అనే చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..
ప్రస్తుతం నది నీటి రంగు, వాసన మారినట్టు స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి CSIR–NEERI (సెంట్రల్ పొల్యూషన్ & ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సంస్థ) కేంద్ర బృందం సైంటిస్టులు, నీటి పరిశోధన శాఖ,రీసెట్ ఇనిస్టిట్యూట్ సెంటర్, నీటి పరీక్ష ప్రత్యేక బృందాన్ని ఘటన స్థలానికి పంపించింది…
బృందాలు కృష్ణానది వద్దకు చేరుకొని నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలకు పంపించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ఇరిగేషన్ ఎస్సీ నాగభూషణ్ మాట్లాడుతూ కృష్ణానది నీటిలో జరిగిన మార్పులపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా పరిగణిస్తుందని అన్నారు… బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు… ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. నది నీటిలో కలుషితం ఎంత మేరకు ఉందో,దానికి కారణాలు ఏమిటో శాస్త్రీయంగా నిర్ధారించిన తరువాత కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు వివరించారు..
మిషన్ భగీరథ ఇరిగేషన్ ఈఈ రామ్ కిషోర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్ అధికారులు పాల్గొని, నీటి పరీక్షల ప్రక్రియ, తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్ చర్యలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించారు. అవసరమైతే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు పుణ్యక్షేత్రాలకు ఈ ఘటన ప్రభావం చూపకుండా ఉండేందుకు పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగిస్తామని, కలుషితానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నీటి పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
ఎక్కడి నుంచో తెచ్చిపోస్తున్నారా.. లేక స్థానికంగా ఉన్న ఇండస్ట్రీ ల కలుషిత నీరు కలుస్తుందా అంటూ పలు అనుమానాలు..!
గతంలో ఎన్నడు లేని విధంగా కెమికల్ నీరు చూస్తుంటే చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది..
కెమికల్ నీరు తాగుతున్న మూగజీవాల పరిస్థితి ఏమిటో అంటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. పాపం ఎవరిది శాపం ఎవ్వరికి అంటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
బయట నుండీ కెమికల్ తీసుకువచ్చి కృష్ణా నదిలో కలిపితే నిఘవ్యవస్థ ఏమైపోయినట్లు.. అలా బయట నుండి తీసుకువచ్చి కెమికల్ ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చి నీటిలో కలిపితే నిఘవ్యవస్థ నిద్రపోతున్నట్టేనా అంటూ ప్రశ్నిస్తున్నారు…
ఒకవేళ స్థానికంగా ఉన్న ఇండస్ట్రీల ద్వారా ఈ కలిసేతో నీరు బయటికి వస్తే వాటిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమైనట్లే అంటూ కూడా ఆరోపణలు గుర్తిస్తున్నారు..
కనిపిస్తున్న నీరే కాదు భూగర్భ జలాల పరిస్థితి ఏంటి..
స్థానికంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కంపెనీల వృధా నీరు ఎటు పోతున్నట్లు… వాటిపై కనీసం విచారణ చేపట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారా..
భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయంటూ పలువురు ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు..
కనిపిస్తున్న కృష్ణా నది నీరు కలుషితం మాత్రమే మనకు కనిపిస్తోంది..
కనిపించని భూగర్భ జలాల కలుషితం పరిస్థితి ఏమిటి… ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం మఠంపల్లి మండలంలోని మట్టపల్లి పరిసర ప్రాంత ప్రజలను రేకెత్తిస్తున్న అనుమానాలు…
ఎక్కడి నుంచో కెమికల్ నీరు తీసుకువచ్చి కృష్ణా నదిలో పోసారంటూ స్థానికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా..? దీనిపై సంబంధిత అధికారులు పూర్తి విచారణ చేపట్టాలంటే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..