డిజిటల్‌ అరెస్టు పేరుతో 9 గంటలు నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్‌ నేరగాడు!.

బెంగళూరులో డిజిటల్ అరెస్టు పేరుతో మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థాయ్‌లాండ్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ జులై 17న స్నేహితురాలిని కలిసేందుకు బెంగళూరుకు రాగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి అక్రమ నగదు బదిలీ ఆరోపణలు మోపాడు. రూ.58,477 వసూలు చేశాడు. అనంతరం డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను, ఆమె ఫ్రెండ్‌ను పూర్తిగా సోదా చేయాలని చెప్పి వాట్సప్ వీడియో కాల్‌లో 9 గంటలపాటు నగ్నంగా కూర్చోబెట్టాడు. కాగా, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.