ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు 30% చొప్పున కమీషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బాంబులేటి’కి 30% టాక్స్ కట్టాల్సిందేనని, ఆయన దగ్గరికి ఏ భూ పంచాయితీ వెళ్లినా, దాని విలువలో 30% అడుగుతున్నారని విమర్శించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ముగ్గురు మోసగాళ్లు ఉన్నారని, వీరికి అసలైన నాయకుడు అలీబాబా వీరిపైన ఉన్నారని విమర్శించారు. ముగ్గురు మంత్రుల్లో ఏ ఒకరూ జిల్లాకు పనికొచ్చే పనులు చేయడం లేదని, కనీసం రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందనే విషయాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో క్వార్టర్ ఫైనల్ ఫలితాలు వచ్చాయని, ఇక పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో సెమీఫైనల్ ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఫలితాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, ఆగ్రహం కనిపిస్తున్నాయని స్పష్టంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ 7-8 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని, నేతలందరూ మరింత ఐక్యంగా కష్టపడితే పదికి పది స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు..
షాపుల్లో యూరియా లేకుండా, యాప్ తెచ్చినా, కార్డు తెచ్చినా ప్రయోజనమేమిటని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా యూరియా కట్ట కూడా రైతులకు ఇప్పించలేకపోయారని అన్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ పాలేరు నియోజకవర్గ రైతు ఒకరు స్వయంగా తనతో మాట్లాడిన విషయాన్నే చెప్తున్నానని కేటీఆర్ వివరించారు.
1991లో గుంటూరులోని రావు రత్తయ్య కాలేజీలో ఇంటర్ చదువుకున్నాను. నేనైతే ఆంధ్రాలో చదువుకోవద్దు. ఆయన మాత్రం అదే ఆంధ్రాలోని భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకోవచ్చా’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాంబులేటి మంత్రి దీపావళికి బాంబులు వేస్తానని అన్నాడని, ఇప్పటికే రెండు దీపావళులు వెళ్లాయని గుర్తుచేశారు. ఆయన మాత్రం అదానీ, మోదీ కాళ్లు పట్టుకొని ఈడీ కేసులు లేకుండా బీజేపీలో చేరతానంటూ దండం పెడుతున్నారని విమర్శించారు. మరో మంత్రి కార్పొరేటర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని, తాను ఇకడికి వస్తుంటే ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకెళ్లి సీఎం రేవంత్ దగ్గర కూర్చోబెట్టారని మండిపడ్డారు. ‘ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని వెళ్లినా పీకేది ఏమీ లేద’ని స్పష్టంచేశారు. తాము కొత్తవారికి అవకాశం ఇస్తామని, కొత్త నాయకులకు తయారుచేస్తామని చెప్పారు. ఖమ్మంలో మున్నేరు కరకట్ట పనులు, కేబుల్ బ్రిడ్జి పనులు, రహదారులు, జంక్షన్ లభివృద్ధి, కొత్త బస్టాండు, మున్సిపల్ ఆఫీస్, ఐటీ హబ్ లాంటి అభివృద్ధి పనులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని వివరించారు. ఇవన్నీ తన హయాంలో జరుగుతున్నట్టు తుమ్మల చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు..
ఆర్మీ రవిని నిజంగా అభినందిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఈ తమ్ముడి మీద పొంగులేటి కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నించారని, ఎన్నో నిర్బంధాలను ఎదురొని 135 ఓట్ల మెజారిటీతో గెలిచాడని కేటీఆర్ అభినందించారు. అనేక మేజర్ గ్రామపంచాయతీలను టీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. పాలేరు, సత్తుపల్లిలో ఎకువ స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రు లు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, అయినా సర్పంచ్‌లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గెలిచిన సర్పంచ్‌లకు రక్షణగా ఉండేది అంబేదర్ రాసిన రాజ్యాంగమేనని అన్నారు. ఈ ఏడాదంతా ప్రజా ఆందోళనలు నిర్వహిస్తూనే, మరోవైపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు. సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959