మనుషులు పీల్చే గాలి నుంచి అనారోగ్యానికి వాడే మందుల వరకూ అన్నీ కల్తీ అయిపోతున్నాయి. కూరలు, పాలు..ఇలా ఒకటేమిటి అన్ని పదార్థాలు అసలువి దొరకడం మానేశాయి. అలా అని అన్నీ వాడడం మానేసి కూర్చుందాం అంటే వీలు కాదు. జనాలు పాపం అలానే సతమతమవుతూ బతుకుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మోసాలు చేయడం మానడం లేదు కొందరు దుర్మార్గులు. డబ్బులు వస్తే చాలు ఏవరేమైపోతేనేం అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వారినే కొందరిని పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
Adulterated Honey:
ప్రస్తుతం మనం కలి యుగంలో కాదు…కల్తీ యుగంలో ఉన్నాం. ప్రతీ వస్తువూ కల్తీ అయ్యే చేతులకు వస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రాకు పంపడానికి సిద్ధం చేసిన కల్తీ తేనెను అధికారులు పట్టుకున్నారు.
ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి .
అంటే…మనం ఎలా బతుకుతున్నామో అర్థం కావడం లేదు. మనుషులు పీల్చే గాలి నుంచి అనారోగ్యానికి వాడే మందుల వరకూ అన్నీ కల్తీ అయిపోతున్నాయి. కూరలు, పాలు..ఇలా ఒకటేమిటి అన్ని పదార్థాలు అసలువి దొరకడం మానేశాయి. అలా అని అన్నీ వాడడం మానేసి కూర్చుందాం అంటే వీలు కాదు. జనాలు పాపం అలానే సతమతమవుతూ బతుకుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మోసాలు చేయడం మానడం లేదు కొందరు దుర్మార్గులు. డబ్బులు వస్తే చాలు ఏవరేమైపోతేనేం అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వారినే కొందరిని పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
140 క్వింటాళ్ళు…500 డ్రమ్ములు..
ఉత్తరప్రదేశ్(uttarpradesh) నుంచి ఆంధ్రాకు భారీగా తేనె(honey) సరఫరాకు సిద్ధం అయింది. ఒక్కొక్కటి 140 క్వింటాళ్లకు పైగా తేనెను కలిగి ఉన్న 500 డ్రమ్ముల తేనె ట్రక్కలతో రెడీగా ఉంది. మరికొన్ని గంటలు ఆగితే ఇదంతా ఆంధ్రాలో దుకాణాలకు చేరిపోతుంది. కానీ ఈలోపునే ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దానిని పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు ట్రక్కులలో తరలించిన నకిలీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. తేనె గిడ్డంగుల నుంచి అందిన సమాచారం ప్రకారం తనిఖీలు జరిపారు. అక్కడి అధికారులకు..ఒక్కొక్కటి 140 క్వింటాళ్లకు పైగా తేనెను కలిగి ఉన్న 500 డ్రమ్ములు వరుసలలో వరుసలో ఉన్నాయి. బయట ఒక ట్రాన్స్పోర్టర్ ట్రక్ పూర్తిగా లోడ్ చేయబడి, మరొక రాష్ట్రానికి రవాణా చేయడానికి ఆగి ఉండి కనిపించింది. వాటిని చెక్ చేయగా అది మొత్తం నకిలీ తేనెగా గుర్తింపబడింది.