అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్…సబితా ఇంద్రారెడ్డి..

అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి తల్లి, సోదరుడిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, యాదిరెడ్డి మరణం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. యాదిరెడ్డి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, 500 గజాల స్థలం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు.
అలాగే, యాదిరెడ్డి సోదరుడి కుమార్తె భవ్యకు శస్త్రచికిత్స అవసరమైన సమయంలో కూడా సహాయం అందించి చికిత్స చేయించామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎలా అండగా ఉన్నామో, ఇకముందూ అదే విధంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
యాదిరెడ్డి తల్లి, సోదరుడు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై కూడా ఆరా తీసిన కేటీఆర్, పార్టీ పరంగా వారి వైద్య బాధ్యతను తామే తీసుకుంటామని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు…యాదిరెడ్డి తల్లి, సోదరుడు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై కూడా ఆరా తీసిన కేటీఆర్, పార్టీ పరంగా వారి వైద్య బాధ్యతను తామే తీసుకుంటామని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.