అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లీగల్ నోటీసులు
హరీశ్ రావు నుంచి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు
తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు దేవాలయాల్లో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొంటూ అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.
తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువునష్టం సహా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో హెచ్చరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది…
ఈ దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని లీగల్ నోటీసులు పంపిన హరీశ్ రావు..