ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్ ఇప్పుడెలా మాట్లాడుతున్నాడు? ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్రెడ్డి అవమానిస్తున్నారు.. కెటిఆర్.
బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం, భరిస్తాం.. కానీ తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
♦️ రేవంత్రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్కు శాపం పెట్టినట్లు ఉన్నాయి
♦️ ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు, నేడు అక్షరసత్యాలు అయ్యాయి
♦️ పరిపాలన చేతగాని రేవంత్రెడ్డి కాడి కింద పడేశాడు. రేవంత్రెడ్డి అసమర్ధ, దక్షతలేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది..
♦️ అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
♦️ ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్ ఇప్పుడెలా మాట్లాడుతున్నాడు? ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్రెడ్డి అవమానిస్తున్నారు
♦️ ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా?
♦️ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్న కరెంట్, మంచినీళ్లు ఇప్పుడెందుకు వస్తలేవు?
♦️ బీఆర్ఎస్ హయాంలో దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ నేడు ఎందుకు దివాళా తీసింది?
♦️ ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టాం. మొదట శ్వేతపత్రం పెట్టినప్పుడు బీఆర్ఎస్ రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు
♦️ ఇప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.50 లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారు
♦️ రేవంత్రెడ్డి సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా? కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయింది
♦️ కాంగ్రెస్ సర్కార్ నెలకు రూ.2 వేల కోట్ల అప్పులు మాత్రమే చెల్లిస్తోంది. మరో పదేళ్లలో ఏడాది వరకు రూ.2.67 కోట్లు మాత్రమే
♦️ అప్పుల్లో తెలంగాణ 28వ స్థానంలో ఉందని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ కిరణ్కుమార్ రెడ్డి మాకు రాష్ట్రాన్ని అప్పగించినప్పుడు 12వ స్థానంలో ఉండే బంగారు తెలంగాణను 17 నెలల పాలనలోనే అస్తవ్యస్తం చేశారు
♦️ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 2023-24లో రూ. 14,295 కోట్ల ఆదాయం. 2024-25 ఏడాదికి రూ.14 వేల కోట్లు మాత్రమే వచ్చింది
♦️ హైడ్రా పేరుతో పేదవాడి కడుపు మీద కొట్టిండ్రు
♦️ ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని స్వయాన ప్రధాని అన్నారు
♦️ రేవంత్ అనాలోచి నిర్ణయాల వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది
♦️ రేవంత్రెడ్డి పాలనలో జీరో శాతం గ్రోత్ రేట్తో అట్టడుగున ఉన్నది తెలంగాణ. స్టేషన్ ఘన్పూర్లో సభలో రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని రేవంత్ చెప్పారు
♦️ రాష్ట్రం దివాళా తీసిందని ఎవరన్నా బజారున పెట్టుకుంటారా?
♦️ ఈ ప్రభుత్వ నిర్వాకం ఎట్లుందంటే రూ.170 కోట్ల లంచం ఇచ్చి.. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది
♦️ ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరని అంటున్నారు. 43సార్లు ఢిల్లీకి పోతే రూ.43 కూడా తీసుకురాలేదు. రేవంత్రెడ్డి ఢిల్లీ ట్రిప్ ఫోటోలన్నీ బయటపెడతాం
♦️ రేవంత్రెడ్డి ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని చేయలేదు. రాష్ట్రం దివాళా తీసిందని దివానా మాటలు మాట్లాడుతున్నాడు
♦️ సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల ఆదాయం ఎలా పెరుగుతోంది? రూ.వేల కోట్లతో ఫార్మా కంపెనీ పేరుతో లగచర్ల భూములు గుంజుకుంటరు. రేవంత్రెడ్డి వియ్యంకుడి అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినయి
జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు పెరిగింది.. 2 వేల ఎకరాలు కొన్నారు. రేవంత్రెడ్డి సీక్రెట్స్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఆదాయం ఎందుకు తగ్గుతోంది? రేవంత్ కుటుంబం ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి?
🔥 కేసీఆర్ రూ.4.17 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేసిండు
🔥 తెలంగాణ కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం కట్టిండు
🔥 వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు
🔥 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పనులు పూర్తి చేసి, ఒక పంప్ కూడా ఆన్ చేసి మీ చేతుల్లో పెట్టిండు
🔥 17 నెలల్లో మిగతా 10 శాతం పనులు పూర్తి చేయని అసమర్థ సీఎం రేవంత్
🔥 కేసీఆర్ ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిండు
🔥 విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను.. 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చి దిద్దిండు
🔥 రైతు బంధు పథకంతో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో.. రూ.73 వేల కోట్లు నగదు వేసిండు
🔥 కేసీఆర్ 29వేల కోట్ల మంది రైతుల అప్పులు తీర్చిండు
🔥 24 గంటల ఉచిత కరెంటుతో రూ.60 వేల కోట్ల భారం కేసీఆర్ తీసుకున్నడు
🔥 కేసీఆర్ హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు
🔥 హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు
🔥 అఖండ శాశ్వత సెక్రటేరియట్ కట్టిండు
🔥 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిండు
🔥 తెలంగాణ అమరులకు అమరజ్యోతి స్మారకాన్ని నిర్మించిండు
🔥 32 మెడికల్, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు
🔥 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు
🔥 గ్రామగ్రామాన రైతు వేదికలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు కట్టిండు
🔥 32 జిల్లాలకు కలెక్టరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆరే కట్టించిండు
♦️ 17 నెలల్లో రేవంత్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
♦️ హెలికాఫ్టర్ల కోసం ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు
♦️ ప్రభుత్వ ఉద్యోగుల మీద అక్కసు వెళ్లగక్కిన రేవంత్రెడ్డి. గొంతెమ్మ కోరికలు అంటూ ఉద్యోగులను రేవంత్ అవమానిస్తున్నాడు. దుర్మార్గపు సీఎం ఆలోచన విధానాన్ని ఉద్యోగ సంఘాలు అర్ధం చేసుకోవాలి
ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే.. సెక్రటేరియట్ ముందు దుశ్శాసన పర్వాన్ని ఆవిష్కరించిండు
♦️ ఇచ్చిన హామీలను ప్రజలు అడగొద్దని రేవంత్రెడ్డి అంటున్నాడు. రేవంత్రెడ్డి పెట్రోల్ ధర రూ.200 చేస్తానంటుండు. అడ్డగోలు వ్యాఖ్యలు మాని సంపద పెంచే ఆలోచన చేయాలి
♦️ కేసీఆర్ చావును నిరంతరం రేవంత్ కోరుకుంటున్నాడు. పాలన చేతగాని రేవంత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి
♦️ పెండింగ్ డీఏలు, కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు. రికవరీ యాక్ట్ కింద కేసీఆర్ పెంచిన 73 శాతం జీతం వాపస్ ఇయ్యమంటాడు. ఆనాటి రోజులకు పోదామని రూ.200 పెన్షన్ అంటాడు. చందాలు వేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతానని అంటాడు
పరిపాలన అంటే బజారు బాష మాట్లాడినంత ఈజీ కాదు. ఒకవైపు దివాళా మాటలు మాట్లాడుతూ మరోవైపు తెలంగాణ రైజింగ్ అంటుండు
ఇచ్చిన హామీలు అమలు చేసేటందుకు పైసల్లేవ్ కానీ.. అందాల పోటీలకు నిర్వహించేందుకు పైసలుంటాయా?
పరిపాలన చేతగాక పోతే తప్పుకో.. రాజీనామా చేయి. తెలంగాణ రాష్ట్రాన్ని తిడతామంటే ఊరుకోం..
కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోం.. నాలుక చీరేస్తాం..