Latest news.. ప్రధాన వార్తలు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం

అప్పటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశానని అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం

ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదంటున్న ప్రభాకర్‌రావు

తన పైఅధికారి అయిన డీజీపీ చెప్తేనే అన్నీ చేశానంటున్న ప్రభాకర్‌రావు

2023 నవంబర్‌ లో ఫోన్ ట్యాపింగ్‌ బాధితులను విచారిస్తున్న సిట్

15 రోజుల్లో 615 ఫోన్‌లను ట్యాప్‌ చేసిన ప్రభాకర్‌ రావు

IAS లతో పాటు పలువురు పోలీస్ అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేసిన ప్రభాకర్‌ రావు..

పనికిరాని సెలవులు: ట్రంప్

USలో చాలా పనికిరాని సెలవులున్నాయని, వాటితో దేశానికి బిలియన్ డాలర్ల నష్టం జరుగుతోందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. బానిసత్వం నుంచి విముక్తికి గుర్తుగా జూన్ 19కి ‘జూన్టేన్త్’ అని సెలవుంటుంది. ‘సెలవుల్ని కార్మికులు కూడా కోరుకోవట్లేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి ఈ సెలవులు అడ్డంకి’ అని పోస్ట్ చేశారు. జూన్టీన్పై నేరుగా స్పందించకపోయినా సెలవురోజు ఈ పోస్టు చేయడం చర్చనీయాంశమైంది..

జగన్ న్ను లేపేసేందుకు కుట్ర జరుగుతోంది: మాజీ మంత్రి!

మాజీ సీఎం జగన్ను లేపేసేందుకు కుట్ర జరుగుతోందని విడుదల రజనీ ఆరోపించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్ను భూ స్థాపితం చేయాలని చూస్తున్నారన్నారు. ఆయన లేకుండా చేసేందుకు రాష్ట్రంలో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఎన్ని కేసులు పెట్టినా నెక్స్ట్ తమ అధికారం ఆపలేరన్నారు…

ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!

గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాలను చవి చూస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం Al2470 ఒక పక్షితో ఢీకొట్టింది. దీంతో విమానాన్ని పూణేలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించి, జూన్ 20న పూణే నుండి ఢిల్లీకి ఎగురుతున్న A12470 విమానం పక్షి ఢీకొనడం వల్ల రద్దు చేయడం జరిగిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్కమింగ్ విమానం పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇది బయటపడింది. దర్యాప్తు కోసం విమానా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో, 3 విదేశీ మార్గాల్లో విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ లక్ష్యం ప్రోగ్రామ్ స్థిరత్వాన్ని పునరుద్ధరించడమేనని ఎయిర్లైన్ తెలిపింది. అలాగే, ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సెగ

పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు తరిమి కొడుతుండడంతో తీవ్ర ఆందోళనలో అత్తా, కోడళ్లు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా, యశస్విని రెడ్డిని అడ్డుకొని నిలదీసిన ప్రజలు

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లు ఉన్నవారికే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయిన యశస్విని రెడ్డి….

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే .

కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు, టికెట్ నాకే వస్తుంది

పార్టీ కోసం చాలాకాలంగా కష్టపడుతున్నాను, అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది – జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్…

ఇరాన్ నుంచి దిల్లీకి 1000 మంది భారతీయులు!.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అదే సమయంలో ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌, భారత్‌ కోసం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.

దీంతో ఇరాన్లో చిక్కుకున్న 1000 మంది భారతీయులు మరికొన్ని గంటల్లో భారత్కు రానున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. అయితే ఇరాన్లోని పలు నగరాల నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందులో తొలి విమానం శుక్రవారం రాత్రి దిల్లీకి చేరుకోనుందని సమాచారం. దాని ద్వారా 1000 మంది రానున్నారట.

అయితే ఇరాన్ నుంచి మరో రెండు విమానాలు శనివారం దిల్లీలో ల్యాండ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఇప్పటికే 110 మంది విద్యార్థులు వచ్చారు. కానీ వారు నేరుగా కాకుండా తొలుత ఆర్మేనియాకు వెళ్లారు. అక్కడి నుంచి జూన్ 18న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బయలుదేరి గురువారం తెల్లవారుజామున దిల్లీలో సురక్షితంగా దిగారు..కాగా, ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 1500 నుంచి 2 వేల మంది విద్యార్థులు ఉండగా, మరో 6 వేల మంది అక్కడ పని చేస్తున్నవారు ఉన్నారు. వీరితోపాటు అక్కడి జలరవాణా సంస్థల్లో పని చేస్తున్న పలువురు నావికులు సైతం ఉన్నారు.అయితే, భద్రతాపరమైన కారణాల వల్ల వారిని దేశం దాటించేందుకు ముందు ఇరాన్ అనుమతించలేదు.

వారం క్రితం ఇజ్రాయెల్‌ చేసిన మెరుపు దాడులతో ఇరాన్‌లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్‌లతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు భారతీయులను తరలించేందుకు ఇరాన్‌ ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో తరలింపు ప్రక్రియ జరగనుంది. తద్వారా భారతీయులు స్వదేశానికి రానున్నారు..

ప్రధాన్ మంత్రి కిసాన్ 2 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ.!

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan) 20వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ దఫాకు సంబధించిన డబ్బులు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. రెండు రోజుల్లో నగదు అన్నదాతల అకౌంట్లలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” స్కీమ్ ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.6 వేల చొప్పున నగదు అందిస్తోంది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆ డబ్బును నేరుగా అన్నదాతల బ్యాంక్ ఆకౌంట్లలోనే వేస్తోంది. 6వేల రూపాయలను మూడు దఫాలుగా రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో మొదటి దఫా, రెండో విడతను ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మూడో విడత డబ్బును డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో విడుదల చేస్తోంది. ప్రతిసారీ 2 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.