మంత్రి సీతక్కతో దిగిన ఫోటోలు చూపించి ఇందిరమ్మ ఇల్లు కోసం డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ములుగులో సొంత పార్టీ కార్యకర్తల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్త పగిడిపెల్లి రవి
రూ.5 లక్షలు రావాలంటే లక్షకు 10 వేల చొప్పున 50 వేలు చెల్లించాలని గ్రామస్తులను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులు
రాజీవ్ యువ వికాసం పథకం కోసం నన్ను కూడా రూ.10 వేలు అడిగారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన తోటి కాంగ్రెస్ కార్యకర్త
ములుగు జిల్లా మంగపేట మండలం ముచ్చంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాటూరు నాగయ్య, జంగం భానుచందర్, ఎడ్ల నరేష్, పల్లె శోభన్ అనే నలుగురు నాయకులు, మంత్రి సీతక్క మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్య పేరు వాడుకుంటూ, వారితో దిగిన ఫోటోలు చూపిస్తూ ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్త పగిడిపల్లి రవి
గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వాలంటే కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని, వచ్చే రూ.5 లక్షల్లో, రూ.1 లక్ష కాంగ్రెస్ కార్యకర్తలే దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
సొంత కార్యకర్తల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తే పార్టీ కోసం ఎలా పనిచేస్తామని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్త పగిడిపెల్లి రవి…