సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసులు షాక్ ఇచ్చారు..

సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసుల ఆల్కహాల్ టెస్ట్!
రీడింగ్ 27 రాగా, (మోతాదు లోపే) రాత్రి తాగినందున అలా వచ్చిందని లాయర్ స్పష్టీకరణ.

తనను అవమానించి, కేసు తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సుబ్బారావు. ..

అయితే తాను రాత్రి మద్యం సేవిస్తే ఉదయం పీఎస్‌కు వచ్చిన తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటని లాయర్ సుబ్బారావు పోలీసులను ప్రశ్నించారు. .తనను అవమానించి, కేసు తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా డ్రంక్ చేసి వాహనం నడిపానా ఏంటి.. కేవలం ఫిర్యాదు చేయడానికి కామన్ మ్యాన్‌లా పీఎస్‌కు వచ్చిన తనతో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. తనపై మంగ్లీ చేసిన ఆరోపణలకు ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. తనపై నిరాధార ఆరోపణలను చేయడంతో ఎంతో మందిని మోసం చేసిన సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను కోరారు.

బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తారు, వారి గురించి మీరు హడావుడి చేయవద్దు అని సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు సూచించారు. అయితే బాధితుల తరఫున తాను లీడ్ చేస్తున్నానని, లాయర్ గా వారికి అన్ని రకాలుగా చట్ట ప్రకారం సహాయం చేస్తానన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని, బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.