Letest news… ప్రధాన వార్తలు..

బీజేపీలో చేరనున్న వెటరన్ హీరోయిన్?

వెటరన్ హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ను కలిశారు. తాజాగా ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా BJPలో చేరనున్నారని, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో ఒకప్పుడు అగ్ర నటిగా వెలుగొందారు..

*షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.*

*రోజుకు మూడు సార్లు మాత్రమే బ్రేక్ దర్శనం*

షిర్డీ : సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్. ఇకనుంచి వీఐపీలు రోజుకు మూడుసార్లు మాత్రమే బ్రేక్ దర్శనం పొందుతారని సాయి బాబా సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ తెలిపారు. అధికారిక సిఫార్సులు లేదా ప్రత్యేక పాస్లు ఉన్న భక్తులకు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు అలాగే రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారని ఆయన తెలిపారు..

అతివేగంగా వచ్చి ఢీకొన్న బొలెరో.. మహిళ స్పాట్ డెడ్

తెలంగాణ : కారు బ్రేక్ డౌన్ అవడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇద్దరికి గాయాలయ్యాయి. డబిల్‌పుర‌కు చెందిన అమిత్ కిరణ్ భార్య కృతిక(30), మాధవ్ (3), అమిత్ కిరణ్ తండ్రి(73)లతో కలిసి తుల్జాపూర్ అమ్మవారి దర్శించుకుని తిరిగి వస్తుండగా కూకట్‌పల్లి వద్ద వారి కారు బ్రేక్ డౌన్ అయింది. కారుదిగి పరిశీలిస్తున్న ఆమెను బొలెరో ఢీకొనడంతో మరణించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు(బుధవారం) వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, తదితరులు పాల్గొననున్నారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు వైసీపీ నేతలే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై చర్చించనున్నారు..

DSC కొత్త హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్పు చేసిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలకు సంబంధించి కొత్త హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
వెబ్‌సైట్:
*https://apdsc.apcfss.in.

రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు

మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి ఉండగా, రూ.6000 రైతుబంధు పథకం కింద జమ చేసిన ప్రభుత్వం

రైతుబంధు డబ్బు ఇవ్వమని తన చిన్న కొడుకు సంతోష్ అడగడంతో, ఆరోగ్యం బాగాలేక రూ.2000 ఖర్చు చేశానని మిగతా రూ.4000 ఇస్తానని చెప్పిన తండ్రి కీర్యా.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యి, తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేసిన సంతోష్..

తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..

*పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు..*

*నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్*

హైదరాబాద్: ఇన్‌చార్జ్ మంత్రుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్‌చార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందుకు ఆయా జిల్లాల్లో ఉపయోగించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

పని చేయకపోతే డిమోషన్..

అలాగే.. మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చినవారు తెలంగాణ రాష్ట్రమంతా తిరగాలని ఆదేశించారు. పదవులు అడగటం తప్పు లేదు.. కానీ నిరసన హుందాగా ఉండాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా చేసి జాబితా సిద్ధం చేయాలని.. ముందు అందరికీ పని అప్పగించాలని ఆదేశించారు. పని చేసిన వాళ్లది ఒక జాబితా, పనిచేయని వాళ్లది మరో జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ఇవాళ(మంగళవారం) గాంధీ‌భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదని తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

పదేళ్లు అధికారం మనదే…

గతంలో తాను టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమంటే కొందరు నేతలు తీసుకోలేదని గుర్తుచేశారు. తాము సీనియర్లం, ఆ చిన్న బాధ్యత తీసుకోమని తనకు ఆ నేతలు చెప్పారని అన్నారు. ఆ రోజు బాధ్యత తీసుకున్ననాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే పదవులు వాటంతట అవే వస్తాయని ఉద్గాటించారు. ఇంకో నాలుగు సంవత్సరాలు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీలో పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావాలంటే.. పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉందని తేల్చిచెప్పారు. పదేళ్లు అధికారం మనదేనని స్పష్టం చేశారు. పార్టీ పదవిని చిన్నచూపు చూస్తే వారికే నష్టమని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వం జోడేదుల్లాలాగా పనిచేయాలని సూచించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని ఉద్ఘాటించారు. పార్టీ నిర్మాణంపైన టీపీసీసీ దృష్టి సారించాలని అన్నారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పని చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

నేతలు కలిసి పని చేయాలి..

మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీల వంటి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహారించాలని కోరారు. మన ప్రభుత్వo చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఉద్గాటించారు. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని వెల్లడించారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు....

సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలన్న జస్టిస్ మాదవి దేవి బెంచ్….

గ్రామ పంచాయితీలకు గడువు ముగిసి ఏడాదిన్నర అయ్యింది. అయితే ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు న్యాయస్థానం తలుపు తట్టారు.

దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం తన తీర్పు వెల్లడించింది. కేవలం మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ మాదవి దేవి బెంచ్ వెల్లడించింది…ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని, ఆ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని అందులో ప్రస్తావించారు.

వెంటనే ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. అది పూర్తి కావడానికి నెల రోజుల గడువు అవసరమన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చారని, ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు దృష్టికి తెచ్చారు. అది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలలు పడుతుందన్నారు. ఈలోగా న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు..