రెండు రోజుల సిట్ కస్టడీకి కాకాణి..

గ్రావెల్‌ అక్రమ తవ్వకాల కేసులో వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అయన్ను 2 రోజుల కస్టడీకి అనుమతించింది. డీఎస్సీ రామాంజనేయులు నేతృత్వంలోని సిట్‌ బృందం బుధ, గురువారాల్లో ఆయన్ని ప్రశ్నించనుంది.

మరోవైపు కాకాణి అక్రమాలు రోజుకొక్కటి వెలుగు చూస్తోంది. అధికార అండతో దోచుకునేందుకు కృష్ణపట్నం పోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అనధికార టోల్‌గేటు గుట్టు వీడింది. స్వలాభం కోసం సొంతంగా లాజిస్టిక్‌ కంపెనీ ఏర్పాటు చేసి తద్వారా రూ.కోట్లు దండుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు..